గత ఇరవై ఏడు సంవత్సరాలుగా టీచర్ గా పని చేస్తూ అనేక పల్లెల్లో తిరుగుతూ కొన్ని వేలమంది పిల్లల్ని ఎంతో దగ్గరగా చూస్తూ ఉండటం మరియు వారిలోని సృజనాత్మకతను గుర్తించి
ఎన్నోసార్లు వారిని ప్రోత్సహించిన అనుభవాల్ని మరియు ఎన్నో ఆసక్తికరమైన, తమాషా సంఘటనలను మీ అందరితో పంచుకోవాలన్న ఆలోచనకి ప్రతిరూపమే ఈ ఇస్కూలు కతలు. గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకపు
ఆలోచనాధోరిణి మరియు కాలుష్యం లేని వారి నిస్వార్ధపు ప్రేమాభిమానాలను మనఃస్పూర్తిగా ఈ బ్లాగు ద్వారా మీకందరికీ అందిస్తాను.